PM Modi | మస్క్ పిల్లలకు బుక్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రధాని మోదీ.. అవేంటో తెలుసా..?
PM Modi | అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) భేటీ అయ్యారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం వాషింగ్టన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి భారతీయ అమెరికన్లు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ట్రంప్ కేబినెట్లో కీలక పాత్ర పోషిస్తున్న టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) సైతం మోదీతో భేటీ అయ్యారు.
It was also a delight to meet Mr. @elonmusk’s family and to talk about a wide range of subjects! pic.twitter.com/0WTEqBaVpT
— Narendra Modi (@narendramodi) February 13, 2025
మోదీ బస చేస్తున్న బ్లేయర్ హౌస్‌కు టెస్లా బాస్ వెళ్లారు. తన గర్ల్‌ఫ్రెండ్, ముగ్గురు పిల్లలతో (Elon Musk Children) అక్కడికి చేరుకున్న మస్క్.. ప్రధానితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మస్క్ ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజూర్ లతో ప్రధాని నరేంద్ర మోదీ సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన మూడు పుస్తకాలను గిఫ్ట్ చేశారు.
నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాకూర్ రచించిన ‘ది క్రెసెంట్ మూన్’, ది గ్రేట్ ఆర్కే నారాయణ్ కలెక్షన్, పండిట్ విష్ణు శర్మ రచించిన పంచతంత్ర పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. ఈ బుక్స్‌ను ఇచ్చిన వెంటనే పిల్లలు వాటిని ఎంతో ఆసక్తికరంగా చదువుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. వాషింగ్టన్ డీసీలో మస్క్‌తో చాలా మంచి సమావేశం జరిగినట్లు చెప్పారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ సహా పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. అంతేకాకుండా పాలనా యంత్రాంగంలో భారత్ తలపెట్టిన సంస్కరణల గురించి మస్క్‌కు వివరించినట్లు మోదీ పేర్కొన్నారు.
Had a very good meeting with @elonmusk in Washington DC. We discussed various issues, including those he is passionate about such as space, mobility, technology and innovation. I talked about India’s efforts towards reform and furthering ‘Minimum Government, Maximum Governance.’ pic.twitter.com/7xNEqnxERZ
— Narendra Modi (@narendramodi) February 13, 2025
Also Read..
White House: మోదీ, ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్.. జర్నలిస్టును అడ్డుకున్న వైట్‌హౌజ్
Donald Trump | ట్రంప్‌తో మోదీ భేటీ.. మిమ్మల్ని చాలా మిస్సయ్యానన్న అమెరికా అధ్యక్షుడు
America | అమెరికాలో కోడి గుడ్ల విక్రయాలపై పరిమితులు.. ఎందుకో తెలుసా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

