America | వాషింగ్టన్: అమెరికాలో కోడి గుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల ప్రజలకు గుడ్లు దొరకడం లేదు. కొన్ని చోట్ల స్టోర్లలో నో ఎగ్స్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో గుడ్ల విక్రయాలపై స్టోర్లు పరిమితులు విధిస్తున్నాయి.
ఒక్కొక్కరికి గరిష్ఠంగా రెండు, మూడు ట్రేలు మాత్రమే ఇస్తున్నాయి. దీంతో చాలా మంది వీటి వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. జనవరి నెల వినియోగదారుల ధరల సూచీ ప్రకారం అమెరికన్ సిటీలలో డజన్ గ్రేడ్ ఏ గుడ్ల సగటు ధర 4.95 డాలర్లు (సుమారు రూ.430).