Shubhanshu Shukla | న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాముల రోదసి యాత్రకు సర్వం సిద్ధమైంది. వ్యోమగాముల్ని ఐఎస్ఎస్కు తీసుకెళ్తున్న ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగాన్ని బుధవారం సాయంత్రం చేపడుతున్నారు. ఈ మిషన్ ద్వారా రాకేశ్ శర్మ (1984లో) తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న రెండవ భారతీయుడిగా శుక్లా చరిత్ర సృష్టించబోతున్నారు. 41 ఏండ్ల తర్వాత రోదసిలో అడుగుపెడుతున్న భారతీయుడిగా ఆయన పేరు రికార్డులకు ఎక్కనున్నది. లక్నోకు చెందిన శుభాన్షు శుక్లా, 2006లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు. ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్ హోదాలో ఉన్నారు. గగన్‌యాన్ మిషన్ కోసం ఏర్పాటుచేసిన ‘భారత వ్యోమగామి దళం’కు 2019లో ఎంపికయ్యారు.