పుణె, సెప్టెంబర్ 7: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడంలో భాగంగా అధికార కూటమి నాయకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు తీసుకుంటున్నదని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ మండిపడ్డారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కాలరాయడమేనని, రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడమేనని కేంద్రప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎన్సీపీ నేత ఏక్నాథ్ ఖడ్సే, మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, శివసేన ఎంపీ భావన గవాలిపై ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.