West Bengal | కోల్కతా, జూలై 15: వానలు పడాలంటూ కప్పల పెండ్లి చేయటం విన్నాం. అయితే.. భూతాపాన్ని తగ్గించేందుకు పశ్చిమ బెంగాల్లో కొంతమంది వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం వార్తల్లో నిలిచింది. బెల్డాంగే మున్సిపాల్టీలో కొంతమంది భూతాపాన్ని తగ్గించేందుకు ఇక్కడి డోలా దక్షిణాపురా ఆలయంలో రెండు చెట్ల మధ్య వివాహాన్ని జరిపించారు.
స్థానిక దేవాలయంలో మర్రిచెట్టుకు, రావిచెట్టుకు జరిగిన వివాహ వేడుకకు 3వేల మందికిపైగా జనం బంధువులుగా హాజరయ్యారు. ఇంట్లో పెండ్లికి తయారైనట్టు కొత్త దుస్తులు వేసుకొని వారంతా రావటం.. కనులపండువగా వివాహాన్ని నిర్వహించటం చూపరులను ఆకట్టుకుంది.