Artificial Rain: క్లౌడ్ సీడింగ్‌తో కృత్రిమ వర్షం.. ఎక్కడ? ఎందుకు ?
Artificial Rain: ఢిల్లీలో కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు.. కృత్రిమ వర్షం కురిపించనున్నారు. ఆర్టిఫిషియల్ రెయిన్‌తో వెదర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్‌ను తొలగించేందుకు ప్రయత్నం చేయనున్నారు. ఢిల్లీ సర్కారు దీని కోసం ప్లాన్ వేసింది. కాన్పూర్ వర్సిటీ కూడా ఆ ప్రక్రియను చేపట్టేందుకు రెఢీగా ఉంది.
న్యూఢిల్లీ: గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ వాయు కాలుష్యంతో తల్లడిల్లుతోంది. పంటలను తగులబెట్టడం.. వాహన కాలుష్యం ఆ నగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక దీపావళి పటాకులతో ఆ ప్రాంతం మరింత విషపూరితంగా మారుతోంది. ఆకాశం అంతా పొగ కమ్మేస్తోంది. గాలి పీల్చుకునేందుకు జనం జంకుతున్నారు. ఒకవేళ దీపావళి తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగితే, ఆ సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ సర్కారు ఓ కొత్త ప్లాన్ వేసింది. కృత్రిమ వర్షం(Artificial Rain)తో గాలిలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నించనున్నది. ఆ కృత్రిమ వర్షం ఏంటో దాని గురించి కొంచం తెలుసుకుందాం.
ఢిల్లీ నగరంపై కృత్రిమ వర్షం కురిపిస్తామని ఆ రాష్ట్ర మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ఈ పద్ధతిలో ప్రయత్నించనున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ 20, 21 తేదీల్లో ఒకవేళ ఆకాశం మసకబారిపోతే, ఆ సమయంలో క్లౌడ్ సీడింగ్ జరపనున్నట్లు ఆయన తెలిపారు. వాయు నాణ్యతను పెంచే ఉద్దేశంతో ఈ చర్యను చేపట్టనున్నారు.
కృత్రిమ వర్షాన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు. ఈ విధానంతో వెదర్లో మార్పును తీసుకువస్తారు. గాలిలో నీటి బిందువులు ఏర్పడేలా ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. సిల్వర్ ఐయోడైడ్, పొటాషియం ఐయోడైడ్ లాంటి పదార్ధాలను గాలిలోకి వదులుతారు. దీని కోసం విమానాన్ని కానీ హెలికాప్టర్‌ను కానీ వాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సక్సెస్ కావాలంటే, ఆ పరీక్ష సమయంలో వాతావరణంలో తేమ చాలా అవసరం అవుతుంది. గాలి కూడా అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం వల్ల ప్రజలు శ్వాస పీల్చేందుకు ఇబ్బందిపడుతున్నారు. అక్కడ ప్రజల ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది. కాలుష్యంతో నిండిన గాలిని పీల్చడం అంటే రోజుకు పది సిగరెట్లు తాగినట్లే లెక్క. అయితే ఆ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కృత్రిమ వర్షాన్ని కురిపించనున్నారు.
కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు కాన్పూర్ ఐఐటీ సంస్థతో ఢిల్లీ సర్కార్ మంతనాలు జరిపింది. ఆ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మణింద్ర అగర్వాల్ దీనిపై మాట్లాడారు. తమ వద్ద ఓ ప్రత్యేకమైన విమానం ఉందని, దానికి క్లౌడ్ సీడింగ్ పదార్ధాలు ఉంటాయని, డీజీసీఏ అనుమతితో ఆ విమానం ఎగురుతుందని ఆయన తెలిపారు. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఉన్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ పద్దతిని వినియోగించనున్నట్లు ప్రొఫెసర్ చెప్పారు. కృత్రమ వర్షం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుందని, నీటితో ఆ డస్ట్ కొట్టుకుపోతుందని, దీంతో పర్యావరణం క్లీన్ అవుతుందని ఆయన తెలిపారు.
#WATCH | Kanpur, UP: IIT Kanpur professor Manindra Agrawal on artificial rain project, “IIT Kanpur has its own aircraft in which flares have been attached to do cloud seeding and it has been approved by DGCA. With this, we can do cloud seedings anywhere…We along with CII have… pic.twitter.com/nb18946nMz
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 9, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

