మంచిర్యాల ఏసీసీ, మే 1: అపర కుభేరుడు, కార్మిక, బలహీన వర్గాల నాయకుడికి మధ్య లో జరుగుతున్న పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల పోరులో బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తామని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా (టీఎంహెచ్డీ) నాయకులు ప్రకటించారు. బుధవారం పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుశ్నపల్లి రవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండుకూరి రాజు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి రాజలింగు, నాయకులు రేగొండ శ్రీనివాస్, తుంగపిండి అనిల్, కొండకూరి ప్రశాంత్ పాల్గొన్నారు.