కోల్కతా: పశ్చిమబెంగాల్లో నారదా స్టింగ్ ఆపరేషన్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు రాష్ట్ర మంత్రులను విచారిస్తుండటం కలకలం రేపింది. కేంద్ర ప్రభుత్వం కుట్రతోనే తమ నాయకులపై పాత కేసును తిరిగదోడి విచారణ చేయిస్తున్నదని తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీబీఐ కార్యాలయం బయట ఆందోళనకు దిగాయి.
ఆందోళనకారులు సీబీఐ కార్యాలయం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారుల్లో కొందరు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దాంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | TMC protesters pelted stones on security forces in West Bengal outside the CBI office. pic.twitter.com/GxGUZmIQxe
— ANI (@ANI) May 17, 2021
#WATCH | Security forces carried out baton charges against TMC protesters outside the CBI office in West Bengal. pic.twitter.com/yfdWmYLmB4
— ANI (@ANI) May 17, 2021