కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ ఏడో విడుత పోలింగ్ జరుగుతున్నది. ఈ సందర్భంగా అసన్సోల్ దక్షిణ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో టీఎంసీ ఏజెంట్ ధరించిన టోపీపై ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఫొటో ఉండటం రాజకీయంగా కలకలం రేపింది.
నియోజకవర్గంలోని భక్తర్నగర్ హైస్కూల్ పోలింగ్ బూత్‌లో ఈ కలకలం చెలరేగింది. పోలింగ్ బూత్‌లో ఓ ఏజెంట్ మమతాబెనర్జి ఫొటో ఉన్న టోపీ ధరించాడని తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పౌల్ అక్కడి చేరుకున్నారు. టోపీ ధరించిన ఏజెంట్‌ను, పోలింగ్ సిబ్బందిని నిలదీశారు. దాంతో తనకు అనారోగ్యంగా ఉండటంతో అవన్నీ గమనించలేకపోయానని ఆ బూత్ ప్రిసైడింగ్ అధికారి చెప్పారు.
EC has said that you can't wear anything that has your party's symbol or a political leader's picture. This is Mamata Banerjee's trick. She knows people won't vote for her. Her time is up. The agent says that he didn't know about it. I will complain: Agnimitra Paul, BJP pic.twitter.com/7qIdx37SJd
— ANI (@ANI) April 26, 2021
అనంతరం మీడియాతో మాట్లాడిన అగ్నిమిత్ర.. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కొనసాగుతున్నప్పుడు పోలింగ్ బూత్లోగానీ, పరిసరాల్లోగానీ పార్టీ గుర్తును ప్రదర్శించరాదని, కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఇలాంటి ట్రిక్కులను ప్లే చేస్తున్నదని ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
తెలంగాణలో 24 గంటల్లో 43 మంది మృతి
ప్రముఖ డైరెక్టర్ ఇంట విషాదం..!
ఎవరు ఈ చోలే జావో .. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్స్