కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రజలు ముఖ్యమంత్రి మమతాబెనర్జి వెంటే ఉన్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ చెప్పారు. ఏడో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నుస్రత్ జహాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి కోల్‌కతాలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపైన, ఎన్నికల సంఘంపైన విమర్శలు చేశారు.
Wherever I've been campaigning I've seen people's support for only one face-our CM's…Why was EC sleeping all this while? When PM decided he won't hold any public meetings, EC decided to call off all public meetings. It listens to PM & HM more than anyone else: Nusrat Jahan Ruhi pic.twitter.com/cg7Lp1xwxc
— ANI (@ANI) April 26, 2021
ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టల్లా తోకాడిస్తున్నదని నుస్రత్ ఆరోపించారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల బహిరంగసభల్లో పాల్గొనకూడదని ప్రధాని నిర్ణయించుకున్న తర్వాత ఎన్నికల సంఘం బహిరంగసభలపై నిషేధం విధించిందని.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి చెప్పినట్లే ఈసీ నడుచుకుంటున్నదని విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
తెలంగాణలో 24 గంటల్లో 43 మంది మృతి
ప్రముఖ డైరెక్టర్ ఇంట విషాదం..!
ఎవరు ఈ చోలే జావో .. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్స్