TMC | కోల్కతా: వైద్యురాలి హత్యాచార ఘటన తృణమూల్ కాంగ్రెస్లో ముసలం పుట్టించింది. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించడంతో పాటు అరకొరగా చర్యలు తీసుకున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జవవహర్ సిర్కార్ రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. అవినీతి, అస్మదీయుల విషయంలో అధిష్ఠానం పట్టించుకోనట్టు వ్యవహరించడం తనను నిరుత్సాహానికి గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కోట: రాజస్థాన్లోని కోటాలో 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయంలోని 6,110 రాళ్లను వైద్యులు తొలగించారు. లాప్రోస్కోపిక్ సర్జన్ దినేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, బుండి జిల్లావాసి అయిన ఈ వృద్ధుడు కొద్ది రోజుల నుంచి కడుపు నొప్పి, ఉబ్బరం, వాంతులతో బాధపడుతున్నారు. దినేశ్ నేతృత్వంలోని వైద్య బృందం సోనోగ్రఫీ చేయగా ఆయన పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు తెలిసింది. వెంటనే ఈ నెల 5న అరగంటకుపైగా శ్రమించి ఆ రాళ్లను తొలగించారు.