కోల్‌కతా : అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పశ్చిమ బెంగాల్లో అటు అధికార టీఎంసీ, విపక్ష బీజేపీలు తమ రాజకీయ ఎత్తుగడలను వేగవంతం చేశాయి. తాజాగా, ఓట్ల లెక్కింపులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా కౌంటింగ్ సూపర్వైజర్లుగా చేర్చడానికి అనుమతించాలంటూ టీఎంసీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం జరిగే ఓట్ల లెక్కింపులో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను మాత్రమే సూపర్వైజర్లుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు గురువారం తిరస్కరించింది. దీంతో టీఎంసీ శుక్రవారం సుప్రీంను ఆశ్రయించింది.
రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 15 కేంద్రాల్లో ఈ నెల 2న (శనివారం) ఈ పోలింగ్ జరగనుంది. మగర్హట్ పశ్చిమ నియోజక వర్గంలోని 11, డైమండ్ హార్బర్లోని 4 కేంద్రాల్లో ఓటింగ్ జరగనున్నది.