న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్(Loksabha Speaker)గా ఓం బిర్లా ఇవాళ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే మూజువాణి ఓటు ద్వారా ఆయన్ను ఎన్నుకున్నారు. దీనిపై ఇండియా కూటమిలోని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మధ్య విభేదాలు వచ్చాయి. ఆ రెండు పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఇండియా కూటమి తరపున సురేశ్‌ను నిలబెట్టినా.. మూజువాణి ఓటు ద్వారా ఎలా ఎన్నిక నిర్వహిస్తారని తృణమూల్ ప్రశ్నిస్తోంది.
సభలో విభజన చేపట్టాలని చాలా మంది ఎంపీలు డిమాండ్ చేస్తున్నా.. సంఖ్యా బలం లేని ప్రభుత్వం మూజువాణి ఓటుతో స్పీకర్‌ను ఎన్నుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఇండియా కూటమి అభ్యర్థిగా సురేశ్‌ను ఎంపిక చేసిన విషయంలోనూ కాంగ్రెస్ వైఖరిని టీఎంసీ తప్పుపట్టింది. సరైన రీతిలో చర్చలు చేపట్టకుండానే సురేశ్‌ను అభ్యర్థిగా ప్రకటించారని తృణమూల్ ఆరోపించింది.
INDIA parties exercised their democratic right and moved motions in support of Kodikunnil Suresh as Lok Sabha Speaker.
Voice Vote was taken.
Thereafter, INDIA parties could have insisted on division.
They did not do so. This is because they wanted to a spirit of consensus and…
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 26, 2024
డివిజన్ చేపట్టాలని అనేక మంది సభ్యులు డిమాండ్ చేస్తున్నా.. ప్రోటమ్ స్పీకర్ భర్తృహరి మహతబ్ మాత్రం మూజువాణి ఓటుతో స్పీకర్‌ను ఎన్నుకున్నారని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. సభలో డివిజట్ చేపట్టాలని ఎవరైనా సభ్యుడు కోరితే, అప్పుడు ప్రోటెం స్పీకర్ ఆ విభజనకు అనుమతివ్వాలని, కానీ ఓటింగ్ తీర్మానం చేయకుండానే స్పీకర్ ఎన్నికను ముగించి వేసినట్లు అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.
కానీ స్పీకర్ ఎన్నిక విషయంలో ఓట్ల విభజన కోరలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఇండియా కూటమి ఓట్ల విభజన కోరలేదని, ఎందుకంటే ఏకాభిప్రాయ స్పూర్తి ఉండాలని, పరస్పర సహకారం మధ్య స్పీకర్ ఎన్నిక జరగాలని ఆశించినట్లు జైరాం రమేశ్ వెల్లడించారు. సురేశ్‌కు మద్దతుగా ఇండియా కూటమి పార్టీలు తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని, మూజువాణి ఓటు ద్వారా ఎన్నిక ఖరారైందని, కావాలంటే ఇండియా కూటమి పార్టీలు డివిజన్ కోరేవని, కానీ ఆ ప్రక్రియ చేపట్టలేదని రమేశ్ అన్నారు.
Several members from many parties from the INDIA bloc were robbed of their constitutional right today. The rule is crystal clear👇NDA ran scared ? https://t.co/IDokiGivBR pic.twitter.com/vwJvdSR3z4
— Derek O’Brien | ডেরেক ও’ব্রায়েন (@derekobrienmp) June 26, 2024
ఇండియా కూటమికి చెందిన అనేక మంది సభ్యుల రాజ్యాంగ హక్కును దోచుకున్నారని టీఎంసీ నేత డెరక్ ఒబ్రెయిన్ ఆరోపించారు.