Assembly Elections 2022 | ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఉత్తర ప్రదేశ్లో 48.81 శాతం పోలింగ్ నమోదు కాగా.. పంజాబ్లో 49.81 శాతం పోలింగ్ నమోదయింది. మూడో దశ ఎన్నికల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్లో 16 జిల్లాల్లో 59 నియోజకవర్గాల్లో పోలింగ్ నడుస్తోంది. పంజాబ్లో 117 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.