MK Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తనయుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు డిప్యూటీ సీఎం (deputy Chief Minister) పగ్గాలు అప్పగిస్తారని గత కొన్నిరోజులుగా అధికార డీఎంకేలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై సీఎం ఎంకే స్టాలిన్ తాజాగా స్పందించారు. ఉదయనిధి డిప్యూటీ సీఎం అయ్యే టైమ్ ఇంకా రాలేదంటూ హింట్ ఇచ్చారు.
‘ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేసే సమయం ఇంకా రాలేదు. తనను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ పార్టీలో పెరుగుతోంది. కానీ, మరీ పూర్తి స్థాయిలో లేదు’ అంటూ సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. సీఎం మాటలతో రానున్న రోజుల్లో ఉదయనిధి డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఉదయనిధి ప్రస్తుతం తన తండ్రి కేబినెట్లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు.
మరోవైపు, డిప్యూటీ వార్తలను ఉదయనిధి ఇప్పటికే కొట్టి పారేసిన విషయం తెలిసిందే. మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. కాగా, 2026లో ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
Also Read..
Amarnath Yatra | ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు.. అమర్నాథ్ యాత్రను నిలిపివేసిన అధికారులు
Emergency Landing | ప్రయాణికురాలి తలలో పేలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్