బెంగళూర్ : నూతన సంవత్సర వేడుకలకు (New Year Celebrations0 కౌంట్‌డౌన్ షురూ కావడంతో బెంగళూర్‌లో స్ధానికులు, టూరిస్టుల భద్రత కోసం బందోబస్తు ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. డిసెంబర్ 31న డ్రంకెన్ డ్రైవ్‌పై కఠిన నిబంధనలు, ట్రాఫిక్ ఆంక్షలు, ముమ్మర భద్రతా ఏర్పాట్లను చేపట్టేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. నూతన సంవత్సర వేడుకల కోసం నగర పోలీసులు వివిధ లొకేషన్స్‌లో 48 చెక్ పాయింట్స్‌ను ఏర్పాటు చేశారు.
ఇక అదేరోజు ఎంజీ రోడ్, రెసీడెన్సీ రోడ్, చర్చ్ స్ట్రీట్ వంటి నగరంలోకి కీలక ప్రాంతాల్లో రాత్రి 8 గంటల ఉంచి వాహనాల రాకపోకలు నిషేధించారు. ఇక రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ నగరంలోని ఫ్లైఓవర్లన్నింటినీ మూసివేస్తారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మహిళల భద్రత కోసం బెంగళూర్ పోలీసులు నగరంలో మహిళా భద్రతా ఐలండ్‌ను ప్రవేశపెట్టారు.
ఇది మహిళలకు భద్రతనిచ్చే ప్రదేశంగా మారనుంది. ఇక బెంగళూర్‌లోని అన్ని హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌ల్లో నూతన సంవత్సర వేడుకలను రాత్రి ఒంటి గంటలోపు ముగించాలని పోలీసులు ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 5200 మంది కానిస్టేబుళ్లు, 1800 మంది హెడ్ కానిస్టుబుళ్లు, 600 మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, 600 మంది ఎస్ఐలు, 160 మంది ఇన్స్పెక్టర్లు, 45 మంది ఏసీపీలు, 15 మంది డిసీపీలు, 1 జేసీపీ, ఇద్దరు ఏసీపీలు బందోబస్తు విధుల్లో నిమగ్నం కానున్నారు. నగరంలోని హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు కస్టమర్ల పేర్లు, వయసు, ఫోన్ నెంబర్లతో కూడిన రికార్డ్స నిర్వహించాలని పోలీసులు కోరారు.
Read More :