అహ్మదాబాద్: హైవేపై వేగంగా వెళ్తున్న కంటైనర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. అటుగా వెళ్తున్న స్కూటర్‌పై భారీ కంటైనర్ పడింది. దీంతో స్కూటర్‌పై ఉన్న ముగ్గురు యువకులు దాని కింద నలిగి నుజ్జై మరణించారు. (Three Youths Crushed To Death) గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం మధ్యాహ్నం ముంద్రా-అంజార్ హైవేలోని ఖేడోయ్ గ్రామం సమీపంలో వేగంగా వెళ్తున్న కంటైనర్ ట్రాలీ బోల్తా పడింది. ట్రాలీ వాహనం నుంచి ఊడిన కంటైనర్ అటుగా వెళ్తున్న యాక్టివా స్కూటర్‌పై పడింది. దానిపై ప్రయాణిస్తున్న ముగ్గురు యవకులు భారీ కంటైనర్ కింద నలిగి నుజ్జై మరణించారు.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. క్రేన్‌ను రప్పించి కంటైనర్‌ను తొలగించారు. దాని కింద పడి నలిగి మరణించిన ఇద్దరిని నాయిక్తి, అభిషేక్‌గా గుర్తించారు. మరో వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ ట్రాలీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓవర్ లోడ్ వల్ల కంటైనర్ ట్రాలీ అదుపుతప్పిందా? మరేదైనా కారణం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Black Magic | మొరాయించిన మ్యూజిక్ సిస్టమ్.. చేతబడి అనుమానంతో దంపతులపై దాడి, వ్యక్తి మృతి
Woman Gives Birth To 17th Child | 55 ఏళ్ల వయస్సులో.. 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Minister Chased By Locals | మంత్రిపై దాడికి జనం యత్నం.. కిలోమీటరు దూరం వరకు వెంబడించిన వైనం