Road Accident | చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. దసరా పండుగ నేపథ్యంలో ఓ ఐదుగురు యువకులు చెన్నై నుంచి మున్నార్ ట్రిప్‌కు వెళ్తుండగా.. వారి కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. విల్లుపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ ఇద్దరు యువకులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే కారులో మంటలు చెలరేగడంతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.