జైపూర్: రాజస్థాన్(Rajasthan Borewell)లో మూడేళ్ల చిన్నారి.. బోర్‌వెల్‌లో పడింది. ఆ పాప కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. కోట్‌పుత్లి-బెహోర్ జిల్లాలోని 700 ఫీట్ల బోర్‌వెల్‌లో సుమారు 150 ఫీట్ల లోతులో ఆ అమ్మాయి చిక్కుకున్నది. ఆ చిన్నారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాయి.
ఆ చిన్నారు పేరు చేతన. తండ్రికి చెందిన ఫార్మ్‌లో ఆడుతుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆ చిన్నారి బోర్‌వెల్‌లో పడిపోయింది. కెమెరా ద్వారా ఆ పాప మూమెంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఆక్సిజన్ పైప్ ఆ బోర్వెల్లోకి వేశారు. తొలుత ఆ బోర్వెల్ను తొవ్వేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్న మట్టి కూరుకుపోతున్న కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారింది.
ఓ రాడ్డుకు హుక్ పెట్టి ఆ పాపను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే రాజస్థాన్‌లో ఓ బోర్వెల్ ఘటన జరిగింది. దౌసా జిల్లాలో అయిదేళ్ల చిన్నారి ఓ బోర్‌వెల్‌లో చిక్కుకున్నారు. ఆర్యన్ అనే అబ్బాయిని సుమారు 56 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత రక్షించారు. కానీ ఆ చిన్నారి మృతిచెందినట్లు ఆస్పత్రిలో డాక్టర్లు చెప్పారు.
#WATCH | Kotputli, Rajasthan: Operation is underway to rescue the 3.5-year-old girl who fell into a borewell in Kiratpura village on December 23 pic.twitter.com/kfFB8CYydi
— ANI (@ANI) December 25, 2024