న్యూఢిల్లీ: మూడు దేశాల పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని మోదీ ఒమన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానికి ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను ప్రదానం చేశారు.
మోదీ పర్యటన సందర్భంగా భారత్-ఒమన్ దేశాలు చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తాయని పేర్కొన్నాయి.