ఖంద్వా: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖంద్వా జిల్లాలో ఓ ఎనిమిదేండ్ల బాలుడిపై అత్యాచార యత్నం జరిగింది. బాధితుడి తాత సమయానికి ఘటనా ప్రాంతానికి వెళ్లడంతో విషయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎనిమిదేండ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా మరో నలుగురు అక్కడికి వచ్చారు. బాలుడికి మాయ మాటలు చెప్పి ఓ రూమ్‌లోకి తీసుకెళ్లారు.
దాంతో స్థానికంగా ఉండే మరికొందరు బాలురు దుకాణంలో ఉన్న బాలుడి తాతకు విషయం చెప్పారు. ఆయన వెంటనే అక్కడికి వెళ్లి తన మనవడిని కాపాడుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను రూమ్‌లోకి వెళ్లే సరికి తన మనవడి దుస్తులు విప్పేశారని, అత్యాచారానికి యత్నిస్తుండగానే తాను అక్కడికి చేరుకున్నానని బాధితుడి తాత పోలీసులకు చెప్పారు.
బాధిత బాలుడి తాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లలో ఒకనికి 18 సంవత్సరాలు ఉండగా, మరో ముగ్గురు 16 ఏండ్ల వయసు బాలురు. దాంతో పోలీసులు 18 ఏండ్ల వ్యక్తిని అరెస్ట్ చేసి, మిగతా ముగ్గురు మైనర్లను జువైనల్ కోర్టుకు తరలించారు. కాగా, తమ పిల్లలు అమాయకులని, వారిపై తప్పుడు కేసు బనాయించారని నిందితుల పేరెంట్స్ చెబుతున్నారు.