కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 5: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో మళ్లీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆరు నెలలపాటు ఆయుధాలు పట్టేది లేదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించిన 48 గంటల్లోపే తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో బుధవారం ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది.
బీజాపూర్ జిల్లా తార్లగూడ ఏరియాలో అన్నారం-మారిమళ్ల అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందగా, మరికొందరు గాయాలతో పారిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.