న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న కేరళకు చెందిన పలువురు జడ్జీలు, ఎమ్మెల్యేలు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తులు, శాసనసభ్యులతో కూడిన ఈ బృందం ప్రస్తుతం శ్రీనగర్లో క్షేమంగా ఉన్నదని కేరళ సీఎం కార్యాలయం వెల్లడించింది.
కేరళ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్ కుమార్, జస్టిస్ జి గిరీశ్తోపాటు ఎమ్మెల్యేలు ముకేశ్, కేపీఏ మజీద్, టి సిద్దిక్, కె అన్నాలన్.. తదితరులు ఇటీవల జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సమయంలో వీరు ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉన్నారు. అదృష్టవశాత్తు వీరికి ఎలాంటి అపాయం జరగలేదు.