న్యూఢిల్లీ: ఇరాన్లో ముగ్గురు భారతీయులు తప్పిపోయారు. వీరిని గుర్తించేందుకు, సురక్షితంగా కాపాడేందుకు మన దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కృషి చేస్తున్నది.
ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ అంశంపై న్యూఢిల్లీలోని ఇరానియన్ ఎంబసీతోనూ, టెహ్రాన్‌లోని ఇరానియన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతోనూ ఎంఈఏ అధికారులు చర్చించారు.