బెంగళూరు: దేశమంతటా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. గత కొన్ని రోజులుగా రోజూ రెండున్నర లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో అయితే ఏకంగా 2.95 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అయినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖాలకు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయడంలేదు.
ఈ నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ హోటల్లో పనిచేసే అభిషేక్, నవీన్, భాష అనే ముగ్గురు వ్యక్తులు వినూత్న రీతిలో కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పిస్తున్నారు.ఇవాళ శ్రీరామ నవమి కావడంతో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడి వేషాలు ధరించి, స్థానికంగా గల్లీగల్లీ తిరుగుతూ ఫేస్ మాస్కులు పంపిణీ చేస్తున్నారు. మాస్కులు లేకుండా రోడ్లపైకి వచ్చే వారిని గుర్తించి మాస్కులు ధరింప జేస్తున్నారు.
Karnataka: Three hotel workers in Bengaluru, Abhishek, Naveen and Basha, dress up as Lord Ram, Lord Krishna and Lord Hanuman on #RamNavami today and distribute masks among people. pic.twitter.com/Sg1PdcYrTI
— ANI (@ANI) April 21, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
మామిడి పండ్లు తింటే ఇన్ని లాభాలా..!
38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్.. ఏ జైల్లోనో తెలుసా..?
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
ఈ నెల 30 వరకు బ్రిటన్కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
బెంగాల్లో B.1.618 వేరియంట్ దడ..