సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌ను వరద కష్టాలు వీడటం లేదు. భారీ వర్షాలతో చిగురుటాకులా వణుకుతున్న సిమ్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటన పెను విధ్వంసం సృష్టించింది. సిమ్లా జిల్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలోని ఆలయం కొట్టుకుపోవడంతో ఈ ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన మూడు తరాల సభ్యులు దుర్మరణం పాలవడం విషాదం నింపింది.
శివాలయం కూలినప్పుడు ముగ్గురు పిల్లలు సహా కుటుంబానికి చెందిన ఏడుగురు ఆలయంలో ఉన్నారు. మృతులను పవన్ శర్మ ఆయన భార్య సంతోషి కుమారుడు అమన్, కోడలు అర్చన, ముగ్గురు మనవరాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు కుటుంబసభ్యుల మృతదేహాలను గుర్తించినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు తెలిపాయి.
ఈ కుటుంబానికి చెందిన ఇద్దరితో పాటు మరో ఇద్దరి ఆచూకీ ఇంకా లభించలేదు. తమ కుటుంబసభ్యుల మృతదేహాలు గుర్తించి త్వరగా తమకు అప్పగించాలని, తాము మూడురోజులుగా ఎదురుచూస్తున్నామని బాధిత కుటుంబానికి సమీప బంధువు సునీత శర్మ కోరారు. తమకు భగవంతుడు ఏం చేశాడన్నది తమకు తెలియడం లేదని ఆ కుటుంబానికి చెందిన సునేది కన్నీరుమున్నీరయ్యారు.
Read More :
Shimla | హిమాచల్‌లో కుంభవృష్టి.. సమ్మర్ హిల్ ప్రాంతంలో మరోసారి విరిగిపడ్డ కొండచరియలు