ప్రజాధనాన్ని దోచుకున్నవారు జైలుకు.. బెంగాల్లో ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్లో ఎవరైతే ప్రజాధనాన్ని దోచుకున్నారో వారు ఇప్పుడు దానిని తిరిగి ఇచ్చేసి జైలు శిక్షను అనుభవించాల్సి వస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో శనివారం జరిగిన పశ్చిమబెంగ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
కోల్‌కతా, జూన్ 20: పశ్చిమ బెంగాల్లో ఎవరైతే ప్రజాధనాన్ని దోచుకున్నారో వారు ఇప్పుడు దానిని తిరిగి ఇచ్చేసి జైలు శిక్షను అనుభవించాల్సి వస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో శనివారం జరిగిన పశ్చిమబెంగ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు కలిగించడమే కాక, ఉద్యోగావకాశాల కోసం బెంగాల్ వదిలి వెళ్లాల్సిన దుస్థితిని కల్పించాయని అన్నారు.
‘గత ప్రభుత్వాలు ఎలా పనిచేశాయో మనం కండ్లారా చూశాం. వారు బెంగాల్‌ను వెనుకబాటుతనంలోకి నెట్టేసి మహా నిర్గమన రాష్ట్రంగా మార్చేశారు’ అని అన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించిందని, ప్రస్తుతం బెంగాల్లో తాజాగా ఆశావహ దృక్పథం కనిపిస్తున్నదని అన్నారు.
పీఎం కిసాన్ నిధుల విడుదల
పీఎం కిసాన్ పథకం 23వ విడత కింద రూ.18,880 కోట్ల రూపాయలను ప్రధాని ఈ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 9.44 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

