Akhilesh Yadav | భోపాల్, జూలై 6: ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన ఘటన అత్యంత హేయమైందని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ 18 ఏండ్ల పాలనలో మధ్యప్రదేశ్ సాధించింది ఇదా? అని ఆయన ప్రశ్నించారు.
గురువారం సీఎం శివరాజ్ సింగ్ బాధితుడి కాళ్లు కడగడం అధికార బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామా అని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. ‘హఠాత్తుగా బాధితుడి కాళ్లు కడిగి సీఎం చౌహాన్ క్షమాపణ చెప్పటం..ఓ రాజకీయ విన్యాసం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయ ప్రయోజనానికి బీజేపీ ఈ ఘటనను వాడుకుంటున్నది’ అని బీఎస్పీ చీఫ్ మాయావతి ట్వీట్ చేశారు.