Caste Census | న్యూఢిల్లీ: ఈసారి దేశ జన గణనతోపాటే కుల గణన చేపట్టాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ముస్లింల జనాభా వివరాలను కులాల వారీగా సేకరించనుంది. భారత్లో ముస్లింలలో కుల గణన చేపట్టనుండటం ఇది తొలిసారి. దీని ద్వారా ఆ మతస్థుల సామాజిక-ఆర్థిక, విద్య స్థాయి, స్థితిగతులను తెలుసుకోవాలని బీజేపీ సర్కారు భావిస్తున్నది. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. పస్మందా ముస్లింలను ఓబీసీ విభాగంలో లెక్కించనున్నారు.
1973లో జేఎన్యూ ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్ చేసిన అధ్యయనం ప్రకారం ముస్లింలలో కుల అంతరాలు ఉన్నాయి. అయితే ముస్లింలలో వెనకబడిన వర్గంగా చెప్తున్న పస్మందా ముస్లింలను ఆకట్టుకొని వారిని ఓట్ బ్యాంకుగా మార్చుకోవాలని బీజేపీ కొన్నేండ్లుగా ప్రయత్నిస్తున్నది. దేశంలోని ముస్లింలలో 70 శాతానికిపైగా పస్మందా ముస్లింలే ఉంటారని అంచనా వేస్తున్నది.