Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాదకరస్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 385పైనే నమోదైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి గాలి నాణ్యత (Air quality) పడిపోయింది. నగరం మొత్తాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉష్ణోగ్రతలు సాధారణస్థాయి కంటే గణనీయంగా పడిపోయాయి.
ఆదివారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 385గా నమోదైంది. కొన్ని ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలు దిగజారుతుండటంతో రాజధాని వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలు రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు.