న్యూఢిల్లీ : ఓ గ్రామస్తులు కొత్త గేమ్ ఆడుతున్న వీడియో (Viral Video) ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఇది క్రికెట్ మ్యాచ్ అంటే కాదు..వీరి ఆటలో బ్యాట్ ఉన్నా బంతి కనిపించలేదు. అయితే బాల్ స్ధానంలో ఫుట్‌బాల్ కనిపించింది. ఈ గేమ్ కాన్సెప్ట్ వినూత్నంగా ఉండటంతో ఈ వీడియోను పారిశ్రామిక దిగ్గజం హర్ష్ గోయంకా ట్విట్టర్లో షేర్ చేశారు.
ఈ వీడియోలో పలువురు మహిళలు ఈ వినూత్న గేమ్‌ను ఆడటం కనిపిస్తుంది. పలువురు మహిళలు క్రికెట్ బ్యాట్‌తో ఫుట్‌బాల్‌ను కొడుతుండగా అది వికెట్లకు తాకకుండా వెళుతుంది. కొద్ది దూరంలో స్టంప్స్ ప్లేస్‌లో ఉన్న కుండలను ఇరు వైపులా ఉన్న గ్లాస్ బాటిల్స్‌ను టచ్ చేయకుండా బాల్ ఢీ కొట్టాలి. ఇలా చేయడంలో పలువురు మహిళలు విఫలం కాగా ఓ మహిళ లక్ష్యాన్ని ఛేదించడం చూడొచ్చు.
Golf, cricket, bowling, whatever it is, it seems like a lot of fun! pic.twitter.com/Z4sHeeuYr6
— Harsh Goenka (@hvgoenka) June 14, 2023
విజేతగా నిలిచిన మహిళకు నిర్వాహకులు బహుమతి అందచేశారు. “గోల్ఫ్, క్రికెట్, బౌలింగ్ ఏమైనా అది ఎంతో సంతోషం కలిగిస్తుంది!” అని వీడియోను షేర్ చేస్తూ హర్ష్ గోయంకా రాసుకొచ్చారు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వినూత్న గేమ్ ఎంతో బావుంది..ఆపై విజేతకు బహుమతులు అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, ఫన్ గేమ్ అని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Sreeleela | కొంగొత్త అందాల సుమబాల.. లంగావోణిలో మెరిసిపోతున్న శ్రీలీల