AC Bill : ఏప్రిల్ మొదటివారంలోనే భానుడి భగభగలతో సగటు జీవి ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్ధితి. మండే ఎండలతో జనం తల్లడిల్లుతున్నారు. ఇక మేలో వేసవి ప్రతాపం తలుచుకుంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎండల తాకిడిని తట్టుకోలేని వారు కూలర్లు, ఏసీల కొనుగోలుకు షాపుల ముందు బారులుతీరుతున్నారు. అయితే ఏసీ వాడకంతో కరెంట్ బిల్లు పెరిగిపోతుందని చాలా మంది భయపడుతుంటారు.
అయితే కొన్ని సూచనలు పాటిస్తే ఏసీ బిల్లును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీని సమర్ధవంతంగా వినియోగిస్తే కరెంట్ బిల్లును నియంత్రించవచ్చని చెబుతున్నారు. ఏసీ కూలింగ్ పవర్‌ను పూర్తిస్ధాయిలో వినియోగించడం ద్వారా ఏసీ బిల్లును అదుపులో ఉంచవచ్చు. ఇక తక్కువ సెట్టింగ్‌లో ఏసీని రన్ చేస్తే మేలని భావిస్తుంటారని, కానీ ఇది సరైంది కాదని చెబుతున్నారు. మీ ఏసీని 24 డిగ్రీ సెల్సియస్ వద్ద సెట్టింగ్ చేయడం సౌకర్యవంతంగా, మానవ శరీరానికి మేలైనదిగా ఉంటుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ సూచిస్తోంది.
మీ ఏసీ ఉష్ణోగ్రతను తగ్గిస్తే ప్రతి డిగ్రీకి విద్యుత్ వాడకం 6 శాతం మేరకు పెరుగుతుంది. కరెంట్ బిల్లును ఆదా చేయాలంటే మీ ఏసీ రేంజ్‌ను 20-24 డిగ్రీస్ వద్ద ఉంచాలి. ఇది మీ ఏసీపై భారం తక్కు వ పడటమే కాకుండా అది మెరుగ్గా పనిచేసి విద్యుత్ బిల్లులు కూడా తక్కువ వచ్చేలా చేస్తుంది. ఇంకా ఏసీ బిల్లు తక్కువగా రావాలంటే..
సరైన టెంపరేచర్ సెట్ చేయాలి
క్రమం తప్పకుండా ఫిల్టర్ క్లీనింగ్, సర్వీసింగ్
డోర్స్,విండోస్ క్లోజ్ చేయాలి
ఫ్యాన్ ఆన్ చేయాలి
టైమర్‌ను వాడాలి
Read More :
Road accident | శుభకార్యానికి వెళ్లొస్తుండగా విషాదం.. బైక్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి