బెంగళూరు, జూలై 19: కర్ణాటక అసెంబ్లీలో బుధవారం గందరగోళం నెలకొన్నది. బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశాల కోసం ఐఏఎస్ అధికారుల సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకున్నదని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. సభలో గందరగోళం సృష్టించారు. భోజన విరామం ఇవ్వకుండా కార్యక్రమాలను కొనసాగించాలని స్పీకర్ నిర్ణయించగా.. బీజేపీ ఎమ్మెల్యేలు బిల్లులు, ఎజెండా ప్రతులను చింపేశారు.
దీంతో స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అసభ్య ప్రవర్తన కారణంగా సస్పెండ్ చేసినట్టు స్పీకర్ తెలిపారు. అనంతరం అసెంబ్లీ బయట నిరసన తెలుపుతున్న మాజీ సీఎం బొమ్మై సహా బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకొని విధాన సభ పోలీస్ స్టేషన్కు తరలించారు.