జైపూర్: గిరిజనులకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలంటూ రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగుతున్నది. గిరిజనులు హిందువులు కాదన్న బీఏపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వారు (గిరిజనులు) హిందువులా? కాదా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేస్తామని పేర్కొన్నారు. బన్సవారా ఎంపీ రాజ్‌కుమార్ రోట్ మాట్లాడుతూ డీఎన్ఏ పరీక్ష కోసం తమ గోళ్లు, వెంట్రుకలు, రక్త నమూనాలను పంపాల్సిందిగా కోరుతూ ప్రచారం ప్రారంభిస్తానని హెచ్చరించారు.