చండీగఢ్: పంజాబ్, హర్యానా మధ్య నీటి పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. పక్క రాష్ర్టాలతో ఒక్క చుక్క అదనపు నీటిని పంచుకోవడానికి సిద్ధంగా లేమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు. అవసరమైతే ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు.
సట్లెజ్-యమునా లింక్ కెనాల్ కోసం పంజాబ్లో కేటాయించిన భూమి వివరాలపై సర్వే చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన మరుసటి రోజే మాన్ ‘ఎక్స్’లో నీటి పంపకంపై ఇలా స్పందించారు.