న్యూఢిల్లీ: చార్ధామ్ దేవాలయాలను రోజువారీ సందర్శించే భక్తుల సంఖ్యపై పరిమితిని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తొలగించింది. కొద్ది రోజుల నుంచి ఈ యాత్ర సజావుగా, సాధారణ స్థితిలో కొనసాగుతుండటంతో శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో భక్తు లు రిషికేశ్, హరిద్వార్లలోని రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్దకు వెళ్లి నేరుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను సందర్శించవచ్చు. ఈ దేవాలయాలను సందర్శించాలనుకునే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఏప్రిల్లో రోజువారీ రిజిస్ట్రేషన్లపై పరిమితిని విధించిన సంగతి తెలిసిందే.