న్యూఢిల్లీ: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మూత్ర విసర్జన ఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్లో మరోటి చోటుచేసుకుంది. దళితుడిని కొట్టి, అతని చెవిలో మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు మరొక వ్యక్తి. ఉత్తరప్రదేశ్ సోన్భద్రా జిల్లాలో జూలై 11న చోటుచేసుకున్న ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఘటనలో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. జవహర్పటేల్, గులాబ్ కోల్ విపరీతంగా మద్యం సేవించాక పరస్పరం గొడవపడ్డారు. మద్యం మత్తులో ఉన్న గులాబ్ కోల్పై దాడి చేసి, చెవిలో జవహర్ పటేల్ మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు.