Bangalore | బెంగళూరు, అక్టోబర్ 21: కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు రోజువారీ తంతుగా మారింది. ఒక ఉద్యోగి ఉదయం 10 గంటలకు ఆఫీస్‌కు వెళ్లాలంటే, అతను రెండు గంటల ముందుగానే బయలుదేరాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇక డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చేది రాత్రి 8 గంటల పైమాటే. దాదాపు తన రోజువారీ జీవితం ట్రాఫిక్, ఆఫీసుల్లో గడిచిపోతున్న పరిస్థితి. పని మీద బయటకు వెళ్లాలంటనే ట్రాఫిక్ బారులను చూసి పౌరులు బెంబేలెత్తిపోతున్నారు.
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలను చూపే ఘటనలు, వీడియోలు, చిత్రాలను మనం ఇప్పటికే చాలా చూశాం. తాజాగా ఆఫీస్‌కు వెళ్లేందుకు ఒక యువతి బైక్‌పై వెనుక కూర్చొని వెళ్తూనే ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకొంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని నెటిజన్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ.. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై వ్యంగ్య విమర్శలు చేస్తున్నారు.
ఒక్క బెంగళూరులోనే ఇలా, బెంగళూరులో ఇది సాధారణమైన విషయమే.. అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. చాలా మంది వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఇటీవల ఇలాగే బైక్‌పై ట్రాఫిక్‌లో చిక్కుకొన్న ఓ మహిళ అక్కడే ల్యాప్‌టాప్‌లో తన పని చేసుకొంటున్న మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.