న్యూఢిల్లీ, నవంబర్ 3: సిక్కు మతం, బౌద్ధ మతం కాకుండా ఇతర మతాలలోకి మారిన వ్యక్తులకు షెడ్యూల్డ్ కులాల హోదా కల్పించవచ్చునా లేదా అన్న అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ గడువును మరో ఏడాది పొడిగించారు. వాస్తవానికి కమిషన్ గడువు ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీతో ముగిసింది.
అయితే పరిశీలన ఇంకా పూర్తికాకపోవడంతో తుది నివేదికను అందజేయలేదు. దీంతో కమిషన్ గడువునే మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.