న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 : ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని ఎవరు అధిష్ఠిస్తారన్న సస్పెన్స్‌కు బుధవారంతో తెరపడనుంది. బీజేపీ శాసన సభాపక్షం బుధవారం తమ నేతను ఎంపిక చేసుకోనుంది. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయం వెల్లడి కానుంది. కాగా, గురువారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఉత్సవానికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ మంతా ప్రమాణ స్వీకారం చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.