న్యూఢిల్లీ, జూన్ 18: చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి సుప్రీంకోర్టు వచ్చే నెలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నది. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో పెండింగ్ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు ఈ ప్రత్యేక అదాలత్ నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
దేశంలోని పలు కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులను పరిష్కరించడానికి న్యాయస్థానాలు లోక్అదాలత్లు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా వైవాహిక సంబ ంధ వివాదాలు, ఆస్తి తగాదాలు, మోటారు వాహనాల ప్రమాద కేసులు, భూ సేకరణ, పరిహారం, బీ మా క్లెయిమ్లు వంటి కేసులను లోక్అదాలత్ల ద్వారా ఇరువర్గాల ఆమోదంతో న్యాయస్థానం పరిష్కరిస్తుంది.