Supreme Court | న్యూఢిల్లీ: విశ్వాస ఘాతుకం (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), మోసానికి మధ్య తేడాను కోర్టులు అర్థం చేసుకోలేకపోవటం బాధాకరమని, రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని తప్పు బట్టింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా కొట్టేసింది.
విశ్వాస ఘాతుకం, మోసం రెండింటికీ పోలీసులు ఒకే ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తున్నారని, చట్టాల్ని ఉల్లంఘించారా? లేదా? అన్నది న్యాయమూర్తులు పరిశీలించాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. బులంద్‌షహర్‌లోని ఓ ట్రయల్ కోర్టు ఐపీసీ-406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద కొంతమందికి సమన్లు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేయగా, వారికి నిరాశే ఎదురైంది.