న్యూఢిల్లీ: ఒకే పేరున్న వ్యక్తులు ఎన్నికల్లో పరస్పరం పోటీచేయకుండా నిరోధించాలన్న పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇతర రాజకీయ నాయకుల పేర్లతో ఉన్న వ్యక్తులు స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీచేయకుండా నియంత్రించలేమని స్పష్టం చేసింది.
ఎవరైనా రాహుల్ గాంధీ అనో లేక లాలూ ప్రసాద్ యాదవ్ అనో పేర్లు పెట్టుకుంటే ఎన్నికల్లో పోటీచేయకుండా వారిని ఎలా ఆపగలం? అది వారి హక్కులను కాలరాయడం కాదా?’ అని ప్రశ్నించింది.