న్యూఢిల్లీ: పౌరసత్వ(సవరణ) చట్టం, 2019(సీఏఏ) రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 5 నుంచి విచారణ ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. 2019 డిసెంబర్లో ఆమోదించిన సీసీని సవాల్ చేస్తూ 200కిపైగా పిటిషన్లు దాఖలయ్యాయి.
2014 డిసెంబర్ 31వ తేదీ కన్నా ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ నుంచి భారత్లోకి ప్రవేశించిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, జైనులు, పార్సీ మతాలకు చెందిన వలసదారులకు పౌరసత్వం కల్పించే ఉద్దేశంతోనే సీఏఏ రూపొందింది. ఈ పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది.