న్యూఢిల్లీ: ఎఫ్ఐఆర్ నమోదు చేసే దశలో ఫిర్యాదులోని నిజాయితీ లేక విశ్వసనీయతపై పోలీసులు లోతుగా పరిశీలించాల్సిన అవసరం లేదని, గుర్తించతగిన నేరం జరిగినట్లు ఫిర్యాదులో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది.
ఫిర్యాదులో పేర్కొన్న సమాచారం విశ్వసనీయత, నిజానిజాల గురించి ఆలోచించాల్సిన అవసరం పోలీసులకు లేదని జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బీ వరాలేతో కూడిన ధర్మాసనం తెలిపింది.