న్యూఢిల్లీ: వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను కాదని బకాయిలను 4 వాయిదాల్లో చెల్లిస్తామని రక్షణ శాఖ ప్రకటించడం ఏమిటని నిలదీసింది.
ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. ‘ఇంటిని చక్కదిద్దుకోండి’ అంటూ రక్షణశాఖకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం హితవు పలికింది.