అయోధ్య: శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య తిలకం శోభాయమానంగా ప్రకాశించింది. శ్రీరాముడు జన్మించిన పర్వదినం శ్రీరామ నవమి సందర్భంగా సూర్య కిరణాలు నేరుగా ఆయన నుదుటిని తాకాయి. ఆదివారం మధ్యాహ్నం కచ్చితంగా 12 గంటలకు ఈ దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. దీంతో భక్తులంతా భక్తిపారవశ్యంలో ఓలలాడారు. దివ్యానుభూతికి లోనయ్యారు.
శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు భజనలు, రామ నామ జపాలు, రామాయణ పారాయణలు చేశారు.