శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. గందేర్బల్, శ్రీనగర్, బుద్గాం జిల్లాలతో పాటు జమ్ము ప్రాంతంలోని రియాసి, రాజౌరి, పూంచ్ జిల్లాల పరిధిలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగగా, సాయంత్రం 6 గంటల సమయానికి 56.05 శాతం ఓటింగ్ నమోదైంది.
అత్యధికంగా రియాసి జిల్లాలో 71.81 శాతం ఓటింగ్ నమోదు కాగా, అత్యల్పంగా శ్రీనగర్ జిల్లాలో 27.31 శాతం మాత్రమే జరిగింది.