పూరీ: ఒడిశాలోని శ్రీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండార్‌లో తలుపులకు రెండు వైపులా బంగారు తాపడం చేయించబోతున్నారు. జగన్నాథుని గురించి విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ప్రత్యేకంగా ఓ ఎఫ్ఎం రేడియోను కూడా ప్రారంభించబోతున్నారు.
శ్రీ జగన్నాథ్ దేవాలయ నిర్వహణ కమిటీ (ఎస్జేటీఎంసీ) ఈ నిర్ణయాలను ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.413 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.