High Court | చండీగఢ్: ప్రసూతి సెలవులో ఉన్న ఉద్యోగినిని తొలగించరాదని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రసూతి సెలవును మంజూరు చేసిన తర్వాత, ఉద్యో గం నుంచి తొలగించడం కోసం ఆ సెలవును కుదించకూడదని తెలిపింది. జీతం బాకీలను బాధితురాలికి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఆమె కు మంజూరైన సెలవు దినాలు పూ ర్తయిన తర్వాత మాత్రమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. సెలవు కాలంలో పూర్తి జీతాన్ని పొందే హక్కు ఆమెకు ఉన్నట్లు తెలిపింది. పెండింగ్ శాలరీని 8 వారాల్లోగా ఆమెకు చెల్లించాలని ఆదేశించింది.